CM Revanth Reddy: మహా కుంభమేళాలో తొక్కిసలాట.. సీఎం రేవంత్‌ రియాక్షన్ ఇదే..!

by Shiva |
CM Revanth Reddy: మహా కుంభమేళాలో తొక్కిసలాట.. సీఎం రేవంత్‌ రియాక్షన్ ఇదే..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తర్‌ప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలోని మహా కుంభమేళా (Maha Kumbhmela)లో ఇవాళ తెల్లవారుజామున జరిగిన తొక్కిసలాట ఘటనపై తెలంగాణ (Telangana) సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పందించారు. మృతుల కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సంతాపాన్ని తెలిజేశారు. అదేవిధంగా క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం (Central Government)తో పాటు యోగి సర్కార్ (Yogi Government) కూడా ఆదుకోవాలని సూచించారు. యూపీ సర్కార్ కోరితే తెలంగాణ రాష్ట్రం (Telangana State) నుంచి కూడా అవసరం అయిన సాయాన్ని అందజేస్తామని భరోసానిచ్చారు.

కాగా, మహా కుంభమేళా (Maha Kumbhmela)లో మంగళవారం అర్ధరాత్రి తొక్కిసలాట జరిగింది. త్రివేణి సంగమం (Triveni Sangam) వద్ద భక్తులు అమృత స్నానం చేసేందుకు ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో ఘాట్ వద్ద బారికేడ్లు (Baricades) విరిగిపడటంతో ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు 20 మంది భక్తులు మరణించినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు గాయపడిన 50 మంది క్షతగాత్రులను పారా మిలటరీ దళాలు (Para Military Forces), వాలంటీర్లు (Volunteers) అంబులెన్స్‌లలో సమీపంలోని మహాకుంభ్ నగర్‌లోని సెంట్రల్ ఆసుపత్రి (Central Hospital)కి తరలించి చికిత్స అందజేస్తున్నారు. మౌని అమావాస్య (Mauni Amavasya) సందర్భంగా భక్తులు పుణ్య స్నానానికి భారీ ఎత్తున తరలిరావడంతో తొక్కిసలాట చోటుచేసుకున్నట్లుగా సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు.

సీఎం యోగీకి ప్రధాని మోదీ, అమిత్ షా ఫోన్..

మహా కుంభమేళాలో తొక్కిసలాట జరిగిందనే విషయం తెలిసిన ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) నేరుగా ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు (CM Yogi Adityanath)కు ఫోన్ చేశారు. ఈ మేరకు గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఫిబ్రవరి 13న ప్రధాని మోడీ కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించనున్నారు. అదేవిధంగా తొక్కినలాట ఘటనపై హోం మంత్రి అమిత్ షా (Central Home Minister Amit Shah), సీఎం యోగిని అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు కేంద్రం నుంచి సాయం అందిస్తామని ఆయను సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు భరోసానిచ్చారు. అయితే, తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్యపై ప్రభుత్వం ఇప్పటి ఎలాంటి ప్రకటన చేయలేదు.

Next Story

Most Viewed