ఎంపీ డీకే అరుణ‌తో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. అసలు విషయం ఇదే.!

by Shiva |
ఎంపీ డీకే అరుణ‌తో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. అసలు విషయం ఇదే.!
X

దిశ, వెబ్‌డెస్క్: మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ (MP DK Aruna) ఇంట్లో ఆగంతకుడు ప్రవేశించడం కలకలం రేపింది. జూబ్లీహిల్స్‌(Jubilee Hills)లోని ఆమె నివాసంలోకి శనివారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగుడు ప్రవేశించాడు. ముసుగు, గ్లౌజులు ధరించి ఏకంగా ఇంట్లోకే చొరబడ్డాడు. ఇంట్లోని కిచెన్, హాల్, సీసీ కెమెరాలు ఆఫ్ చేసి లోపలికి వచ్చాడు. సుమారు గంటన్నర పాటు ఇంట్లోనే తిరిగాడు. గమనించిన ఇంట్లోని సిబ్బంది భయాందోళనకు గురై విషయాన్ని వెంటనే ఎంపీ డీకే అరుణ (DK Aruna) దృష్టికి తీసుకెళ్లారు. అప్రమత్తమై ఆమె జూబ్లీహిల్స్ (Jubilee Hills) పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నేరుగా డీకే అరుణకు ఫోన్ చేసి మాట్లాడారు. అదేవిధంగా తన అనుమానాలకు ఆమె సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఖచ్చితంగా కుట్ర కోణం దాగి ఉందని తనకు వెంటనే భద్రత పెంచాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి జరిగిన ఘటనపై దర్యాప్తు జరిపిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా వెంటనే భద్రత పెంచాలని పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు.

Next Story

Most Viewed