ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి సరఫరాపై CM రేవంత్ స్పెషల్ ఫోకస్

by GSrikanth |
ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి సరఫరాపై CM రేవంత్ స్పెషల్ ఫోకస్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి సరఫరాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మేరకు ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు సెక్రెటేరియట్‌లో సంబంధిత విభాగాలపై సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు, వడ్లకు కనీస మద్దతు ధర అంశాలు, పలు మార్కెట్లలో రైతుల నుంచి వస్తున్న ఫిర్యాదులపై స్పందించారు. ఎండాకాలంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టే చర్యలు, తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయాలపై అధికారులతో చర్చించనున్నారు.

కాగా, నిన్న ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రైతులు పండించిన ధాన్యమంతా కొనేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నదని, కానీ రైతుల కష్టాన్ని మార్కెట్ కమిటీ అధికారులు నీరుగార్చే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలుంటాయని గురువారం ఎక్స్(ట్విట్టర్) వేదికగా సీఎం హెచ్చరించారు. వ్యాపారులతో కుమ్మక్కై తక్కువ చేసే ప్రయత్నం చేస్తే సహించేది లేదన్నారు. రైతులను మోసం చేయడానికి ప్రయత్నించిన వారిపై క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు.

Advertisement

Next Story