- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కేసీఆర్‌తో చాలా విషయాలు మాట్లాడాల్సి ఉంది.. CM రేవంత్ షాకింగ్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో అత్యంత పారదర్శకంగా పాలన కొనసాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో సీఎం రేవంత్ చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ పాలనలో ప్రత్యర్థి పార్టీలకు విమర్శించే అవకాశం కూడా ఇవ్వడం లేదని అన్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగాయని అన్నారు. కాళేశ్వరం విషయంలో నిపుణులు తేల్చిందే పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆ నివేదిక ఆధారంగానే ముందుకు వెళతామని చెప్పారు. తెలంగాణ అంటేనే రాచరికనికి వ్యతిరేకం అన్నారు.
తెలంగాణ అంటే త్యాగాలు, పోరాటాలు గుర్తొస్తాయని వెల్లడించారు. అవే గుర్తుకు వచ్చేలా చిహ్నం, గేయం రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. ఫోన్ ట్యాపింగ్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు, ఇంకా రివ్యూ చెయ్యలేదని అన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే చాలా విషయాలు ఆయనతో చర్చించేది ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ గేయానికి సంగీతం సమకూర్చడం సహా మొత్తం వ్యవహారాన్ని అందెశ్రీకే అప్పగించినట్లు తెలిపారు. మేడిగడ్డపై జ్యుడీషియల్ విచారణ నివేదిక తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కీరవాణి వ్యవహారంతో నాకు సంబంధం లేదు, ఎవరితో సంగీతం చేయించుకోవలనేది అందే శ్రీ నిర్ణయనికే వదిలేసా అని అన్నారు.