- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘మేం సిద్ధం’.. KCR, హరీష్ రావులకు CM రేవంత్ రెడ్డి సంచలన సవాల్
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తున్నట్లు వస్తోన్న వార్తలపై రేవంత్ రెడ్డి ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాల్లో ప్రాజెక్టులపై శ్వేత పత్రం విడుదల చేస్తామని తెలిపారు. ప్రాజెక్టులపై చర్చించేందుకు శాసన సభ ఉమ్మడి సమావేశాలు నిర్వహిద్దామని.. రెండు రోజుల పాటు ప్రత్యేకంగా వాటిపైనే చర్చించేందుకు తాము సిద్ధమని సవాల్ విసిరారు.
ప్రాజెక్టులపై చర్చకు వచ్చేందుకు బీఆర్ఎస్ సిద్ధమా అని ప్రశ్నించారు. ప్రభుత్వం తరుఫు నుండి తాను, ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ మాట్లాడుతామని.. బీఆర్ఎస్ నుండి కేసీఆర్, ఆయన అల్లుడు హరీష్ రావు ఎంతసేపైనా మాట్లాడొచ్చని.. మేం అడ్డురామన్నారు. చర్చకు రెండు రోజులు సరిపోకపోతే సమావేశాలు పొడిగిద్దామని ప్రకటించారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత చర్చకు రావాలని.. దీంతో తెలంగాణకు ఎవరూ అన్యాయం చేశారో తెలిపోతుందని కీలక వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీ సమావేశాలకు రావాలని రేవంత్ ఛాలెంజ్ చేశారు. ప్రాజెక్టులపై చిత్తశుద్ధి ఉంటే నల్లగొండకు పోయి నిరసన తెలపడం కాదని.. ముందు అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు రావాలని సూచించారు. గత ప్రభుత్వం చేసిన పాపాలను కాంగ్రెస్ ప్రభుత్వంపై నెట్టేస్తున్నారని.. తప్పులను కప్పిపుచ్చుకునేందుకే కేటీఆర్, హరీష్ రావు మాపై ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రజలను గందరగోళానికి గురిచేసి లబ్ధిపొందాలని చూస్తున్నారని మండిపడ్డారు.
- Tags
- harish rao