- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CM Revanth Reddy: ఆదాయ సమీకరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష
దిశ, డైనమిక్ బ్యూరో: వార్షిక లక్ష్యాలకు అనుగుణంగా ఆదాయ సమీకరణపై వివిధ శాఖలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. గురువారం సీం నివాసంలో జరిగిన ఈ భేటీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఆదాయ సమీకరణాలకు ఉన్న అవకాశాలను సీఎం ఆరా తీశారు. కేసీఆర్ ప్రభుత్వం గడిచిన పదేళ్లలో రూ.7 లక్షల కోట్ల అప్పులు మోపిందని అప్పటి అప్పులకు వడ్డీలుకట్టేందుకే రాష్ట్ర ఖజానాలో మెజార్టీ వాటా పోతున్నదని అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి సహా మంత్రులు చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ వైపు ఆదాయ మార్గాలు తగ్గుతుంటే అప్పుల భారం పెరుగుతుంటడంతో ఆదాయ వనరులను సమకూర్చుకునేందుకు ఈ సమీక్షలో సీఎం చర్చించారు.ముఖ్యంగా ఆరు గ్యారెంటీల అమలుతో పాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమాలకు ఎక్కడా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఏర్పడకుండా ఆదాయమార్గాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల విషయంలో సీఎం ఆరా తీస్తున్నట్లు సమాచారం. కేంద్ర వద్ద నిధులు రాబట్టుకునే విషయంలో ఎక్కడైనా గ్యాప్ ఏర్పడిందా అనే అంశాన్ని అధికారులను ఆరా తీసినట్లు తెలుస్తున్నది.
మంత్రి ఉత్తమ్ తండ్రి దశదిన కర్మకు హాజరు..
సమీక్ష అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి దశదిన కర్మకు హాజరయ్యారు. హైటెక్స్ హైదరాబాద్ లో జరుగుతున్న ఈ కర్యక్రమానికి హాజరైన సీఎం ఈ సందర్భంగా పురుషోత్తమ్ రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించారు.