- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘మోడీ’ న్యూస్‌ను రీ ట్వీట్ చేసిన సీఎం రేవంత్? ఎమ్మెల్సీ కవిత తీవ్ర విమర్శలు
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని మోడీ రెండు రోజుల పాటు తెలంగాణలో పర్యటించిన సంగతి తెలిసిందే. ప్రోటోకాల్ ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి దగ్గరుండి ఆహ్వానించారు. మరోవైపు ప్రభుత్వ ప్రొగ్రాముల్లో ఇద్దరు కలిసి స్పీచ్‌లు ఇచ్చారు. తర్వాత దగ్గరుండి బేగంపేట్ ఎయిర్ పోర్టులో బుధవారం ప్రధానికి వీడ్కోలు పలికారు. అయితే సభలో ప్రధాని మోడీని సీఎం రేవంత్ రెడ్డి పెద్దన్న అని, తెలంగాణ అభివృద్ధి చెందాలంటే గుజరాత్ మోడల్‌ను అనుసరించాలని అన్నారు. ఆయన తెలంగాణ పర్యటన ముగింపునకు ముందు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలోనే ఆ వార్తను ఓ రిపోర్టర్ ట్వీట్ చేశారు. దీంతో ఆ ట్వీట్‌ను సీఎం రేవంత్ రెడ్డి రీట్వీట్ చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా నెట్టింట రేవంత్ రెడ్డి రీ ట్వీట్ చర్చానీయాంశంగా మారింది.
ఫేక్ ఐడి అంటూ నెటిజన్ల వాదన
ఈ వ్యవహారంపై ఎమ్మెల్సీ కవిత స్పందిస్తూ.. రీ ట్వీట్ చేసినట్లు ఉన్న ఒక ఫోటో షేర్ చేశారు. ‘అన్నయ్య, తమ్ముడి అనుబంధం ఎంత గాఢంగా ఉందో చూడండి! కేవలం బీజేపీ-కాంగ్రెస్ పార్టీల మధ్య అనుబంధాన్ని చూపుతోంది. సోదరులు ఒకరికొకరు ట్వీట్‌లను ఇష్టపడవచ్చు, వారు కోరుకున్నంతగా కౌగిలించుకోవచ్చు! ఈ ప్రక్రియలో తెలంగాణను నాశనం చేయకండి! గౌరవనీయులైన ముఖ్యమంత్రి తన ట్వీట్‌ను తొలగించి, తన ఖాతా హ్యాక్ చేయబడిందని చెప్పుకుంటే నేను ఆశ్చర్యపోను!’ అని విమర్శలు చేశారు. దీనిపై రేవంత్ రెడ్డి వర్గం స్పందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ ట్వీట్‌ను రీ ట్వీట్ చేయాలేదని, అది ఒక ఫేక్ ఐడి రీ ట్వీట్ అని చెబుతున్నారు.