CM Revanth Reddy: సబితా ఇంద్రారెడ్డి ఆవేదనలో అర్థం లేదు

by Gantepaka Srikanth |
CM Revanth Reddy: సబితా ఇంద్రారెడ్డి ఆవేదనలో అర్థం లేదు
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తమను కించపరిచేలా మాట్లాడారని బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి భావోద్వేగానికి లోనైన విషయం తెలిసిందే. తాజాగా.. సబితా భావోద్వేగంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ.. సబితా ఆవేదనలో అర్థం లేదని కొట్టిపారేశారు. మోసానికి ప్రతిరూపం సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సునీతా లక్ష్మారెడ్డి కోసం ప్రచారానికి వెళితే తనపై రెండు కేసులు పెట్టారని గుర్తుచేశారు.

తనను కాంగ్రెస్‌లో చేరాలని రిక్వెస్ట్ చేసి.. ఆమె పార్టీ మారారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు కాంగ్రెస్‌లో నాకు పార్లమెంట్ టికెట్ ఖరారు కాగానే.. సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్‌లో చేరారని అన్నారు. హరీష్ రావు, కేటీఆర్, జగదీశ్ రెడ్డి ముగ్గురు కలిపి ఆరు గంటలు మాట్లాడారని గుర్తుచేశారు. సబిత మీ ఏమాత్రం గౌరవం, అభిమానం ఉన్నా.. హరీష్ రావు, కేసీఆర్‌లు సభకు రావాలని సూచించారు. సభలో బీఆర్ఎస్ నేతలకు ఇవ్వాల్సినంత సమయం ఇచ్చామని తెలిపారు. తాము ప్రజాస్వామ్యంగా సభను నడిపిస్తున్నామని అన్నారు.

Advertisement

Next Story