CM Revanth Reddy: నేడు ప్రజా గాయకుడు గద్దర్‌ వర్ధంతి.. సీఎం రేవంత్‌రెడ్డి ఎమోషనల్ ట్వీట్

by Shiva |   ( Updated:2024-08-06 04:12:08.0  )
CM Revanth Reddy: నేడు ప్రజా గాయకుడు గద్దర్‌ వర్ధంతి.. సీఎం రేవంత్‌రెడ్డి ఎమోషనల్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐదు దశాబ్దాల పాటు పీడిత, శ్రామిక వర్గాల కోసం నిత్య చైతన్యంతో తన ఆట, పాటతో ప్రభుత్వాలపై పోరాడిన యోధుడు కనుమరుగయ్యాడు. తూటాలకు సైతం బెదరకుండా అణగారిన వర్గాల్లో పోరాట స్ఫూర్తిని రగుల్చుతూ.. నిజాం నవాబుకు వ్యతిరేకంగా గళం విప్పిన ప్రజా యుద్ధ నౌక గద్దరన్న అందరికీ దూరమై నేటికి ఏడాది గడుస్తోంది. ఆయన మొదటి వర్ధంతి సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ట్విట్టర్ వేదికగా ఎమోషన్ ట్వీట్ చేశారు. పాటకు పోరాటం నేర్పి.. తన గళాన్ని తూటాగా మార్చి.. అన్యాయంపై ఎక్కుపెట్టిన తెలంగాణ సాంస్కృతిక శిఖరం.. గద్దరన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నా’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.

Advertisement

Next Story