మొక్క నాటిన సీఎం రేవంత్ రెడ్డి.. స్పెషల్ ఏంటో తెలుసా?

by Gantepaka Srikanth |
మొక్క నాటిన సీఎం రేవంత్ రెడ్డి.. స్పెషల్ ఏంటో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని గచ్చిబౌలి(Gachibowli)లో ఐఎస్‌బీ లీడర్ షిప్ సమ్మిట్(ISB Leadership Summit) ప్రారంభమైంది. ఈ సమ్మిట్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమ్మిట్ ప్రారంభానికి ముందు ఐఎస్‌బీ ప్రాంగణంలో సీఎం మొక్క నాటారు. అందరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఐఎస్‌బీలో చదువుకుంటున్న మీరంతా తెలివైనవారు, అసాధారణ విద్యార్థులు అని కొనియాడారు. కాగా, ప్రస్తుత కాలంలో చాలా మంది మొక్కలను పెంచేందుకు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. ఇంట్లో, ఆఫీస్‌లో మొక్కలతో నింపేస్తున్నారు. ఇంకొంత మంది మిద్దె గార్డెన్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. మొక్కలను ఇంట్లో పెంచుకోవడం వల్ల చాలా మంచిది. మనకు ఉపయోగపడే నాలుగు మొక్కలు పెంచుకున్నా చాలు. మరికొందరైతే పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే మొక్కలు నాటి, ప్రకృతి గొప్పతనం గురించి సీఎం రేవంత్ రెడ్డి విమరించారు.

Advertisement

Next Story

Most Viewed