ఈ నెల 16న కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం.. చర్చించే అంశాలివే..!

by Rajesh |
ఈ నెల 16న కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం.. చర్చించే అంశాలివే..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ నెల 16న అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సెక్రటేరియెట్‌లో సమావేశం నిర్వహించనున్నారు. మొత్తం 9 అంశాలతో ఎజెండాను ప్రభుత్వం ఫైనల్ చేసింది. ప్రజాపాలన, ధరణి, వ్యవసాయం సీజనల్ కండిషన్స్, హెల్త్, వన మహోత్సవం, మహిళా శక్తి, విద్య, లాండ్ ఆర్డర్, యాంటీ డ్రగ్ క్యాంపెయిన్‌లపై ఈ సమావేశంలో సీఎం రేవంత్ రివ్యూ చేయనున్నారు. బదిలీల ప్రక్రియ, ఉన్నతాధికారుల బదిలీ పూర్తయిన నేపథ్యంలో ఈ భేటీని ఏర్పాటు చేశారు. తమ జిల్లాల పూర్తి సమాచారంతో ఈ భేటీకి హాజరు కావాలని కలెక్టర్లు, ఎస్పీలకు సీఎస్ శాంతి కుమారి ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

Next Story

Most Viewed