- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తండ్రి పేరు చెప్పుకొని కాదు.. అలాంటి వారిని తొక్కుకుంటూ పైకొచ్చా: CM రేవంత్ రెడ్డి
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ‘జన జాతర’ పేరుతో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తాను తాత, తండ్రి పేరు చెప్పుకొని పైకి రాలేదని.. అవినీతి పరులను, దుర్మార్గులను తొక్కుకుంటూ పైకొచ్చానని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను దోచుకున్న ఎవరినీ వదిలిపెట్టబోను అని మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే రాష్ట్రాన్ని దోచుకున్న వారికి ప్రజలు సరిగ్గా బుద్ధి చెప్పారు.. ఇక మా వాటా ఇవ్వాల్సి ఉందని షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రభుత్వం కూలిపోతుంది అని ఎవరైనా అంటే తన్నండి అని కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు. ఈ సందర్భంగా కేసీఆర్, కేటీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.
పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు అయినా గెలిపించి చూపించాలని ఛాలెంజ్ చేశారు. కేసీఆర్ వస్తారో.. కేటీఆర్ వస్తారో తాము చూస్తామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు కోరుకుంటే వచ్చిన ప్రభుత్వమని అన్నారు. రాష్ట్ర మహిళల కళ్లల్లో నీళ్లు రావొద్దని రూ.500 లకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని అన్నారు. కట్టెల పొయ్యి నుంచి మహిళలకు విముక్తి కలిగించాలనే ఆనాడు యూపీఏ ప్రభుత్వం భావించిందని గుర్తుచేశారు. కేవలం రూ.1500 లకే దేశంలోని పేదలందరికీ గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిందని తెలిపారు. తెలంగాణలో గ్యాస్ సిలిండర్ పథకానికి ఇప్పటికే 40 లక్షల మందిని గుర్తించామని అన్నారు. ఎవరికైనా పథకం అందకపోతే మండల కార్యాలయానికి వెళ్లి పేర్లు రాయించుకోవాలని సూచించారు.