- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్.. జీవితంలో ఇక సీఎం కాలేవు: రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: కేసీఆర్ పదేళ్లు ఏం చేశారో చెప్పకుండా.. నాలుగు నెలల్లోనే మనం ఏం చేయట్లేదంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని బడంగల్ పేట్‌లో రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ జీవితంలో ఇక సీఎం కాలేడని కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కారు కార్ఖానాకు పోయిందని.. ఇక తిరిగి రాదని సీఎం సెటైర్ వేశారు. బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. డిసెంబర్‌లో జరిగిన సెమీ ఫెనల్స్ ఎన్నికల్లో గెలిచామన్నారు.
సెమీస్‌లో బీఆర్ఎస్‌ను ఓడించి ఫైనల్‌కు వచ్చామని.. ఇక ఫైనల్‌లో బీజేపీని ఓడించి రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీతో కేసీఆర్ చీకటి ఒప్పందం చేసుకున్నారని.. సబితా ఇంద్రారెడ్డి ఉదయం బీఆర్ఎస్.. సాయంత్రం బీజేపీ అంటున్నారని ఎద్దేవా చేశారు. చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశర్ రెడ్డి రాజకీయాలను కూడా వ్యాపారంగా చూస్తున్నారని.. ఆయనకు ప్రజలు ఎవరూ ఓటు వేయరని అన్నారు. కొండా విశ్వేశర్ రెడ్డి యూపీ లేదా బీహార్ నుండి రాజ్య సభకు వెళ్లాలని రేవంత్ సూచించారు.