- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేపటినుంచే దరఖాస్తుల స్వీకరణ.. తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ కీలక హామీ
దిశ, వెబ్‌డెస్క్: ఆరు గ్యారంటీల దరఖాస్తు పత్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. డాక్టర్ బీఆర్. అంబేద్కర్ సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా లోగో రివీల్ చేశారు. రేపటి(గురువారం) నుంచి తెలంగాణ వ్యాప్తంగా ప్రజాపాలన ప్రారంభం కానుంది. రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో ఆరు గ్యారంటీల దరఖాస్తు పత్రాలను ప్రజాప్రతినిధులు స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. నిస్సాహాయులకు సహాయం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. పట్టణాల నుంచి తండాల వరకు అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
అందరూ హైదరాబాద్‌లోని సచివాలయానికి వచ్చి వినతులు సమర్పించడం కష్టతరంగా మారుతుందని భావించి.. గ్రామాల్లోనే దరఖాస్తుల స్వీకరణ చేపడుతున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 8 రోజుల పాటు దరఖాస్తులను స్వీకరించనున్నామని తెలిపారు. ప్రజలను ప్రభుత్వం దగ్గరకు పిలిపించుకోకుండా.. ప్రభుత్వాన్నే ప్రజల దగ్గరకు చేర్చాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. పకడ్బందీగా ఈ కార్యక్రమాన్ని చేపడుతామని చెప్పారు. ప్రభుత్వంలోకి వచ్చిన రెండ్రోజులకే రెండు గ్యారంటీలను అమలు చేశామని.. మిగతా నాలుగు గ్యారంటీల అమలు కోసమే ఈ దరఖాస్తులు స్వీకరిస్తున్నామని చెప్పారు. అర్హులైన పేదలందరికీ ఈ ప్రభుత్వంలో తప్పకుండా న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఈ వారం రోజుల్లోనే దరఖాస్తు చేయాల్సిన తప్పనిసరి నిబంధన ఏం లేదని.. అనుకూలమైన సమయంలో దగ్గర్లోని ప్రభుత్వ కార్యాయంలో ఎప్పుడైనా దరఖాస్తు సమర్పించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కొండా సురేఖ, సీఎస్ శాంతి కుమారి పాల్గొన్నారు.