బంగారం తాకట్టు రుణమాఫీపై CM రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

by Anjali |
బంగారం తాకట్టు రుణమాఫీపై CM రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: రైతు రుణమాఫీపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రుణమాఫీ కింద కేవలం పంట రుణాలు మాత్రమే మాఫీ అవుతాయని స్పష్టం చేశారు. కాగా మరో నాలుగు రోజుల్లో రుణమాఫీపై మార్గదర్శకాలు విడుదల చేస్తామని తెలిపారు. అలాగే రుణమాఫీకి తెల్ల రేషన్ కార్డు ప్రమాణికం కాదని వెల్లడించారు. కేవలం పట్టా పాస్ బుక్ ఆధారంగానే మాఫీ ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఒక కుటుంబంలో మూడు నాలుగు రుణాలు కలిపి ఎంత ఎక్కువగా ఉన్నా గరిష్టంగా 2 లక్షల రూపాయలు మాత్రమే రుణమాఫీ వర్తిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. రుణమాఫీ కింద పంట రుణాలు మాత్రమే మాఫీ అవుతాయని.. బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలు మాఫీ కావని స్పష్టం చేశారు. అలాగే కేంద్ర బడ్జెట్ పెట్టిన రెండు రోజుల తర్వాత రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తామని వెల్లడించారు. కాగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై దృష్టి సారిస్తామని సీఎం పేర్కొన్నారు. మహిళలకు ఫ్రీ బస్సు పథకం కోసం ఆర్టీసీ ప్రతి నెల 350 కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed