- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సినిమా వాళ్లు కొంతైనా తిరిగి ఇవ్వాల్సిందే.. CM రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: సమాజం నుంచి ఎంతో తీసుకుంటున్న సినిమా వాళ్లు తిరిగి కొంతైనా ఇవ్వాల్సిందే అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన పోలీస్ మీట్‌లో ముఖ్యమంత్రి మాట్లాడారు. గంజాయి మత్తులో నేరాలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. నేరాలు అరికట్టేందుకు కృషి చేసిన అధికారులకు ప్రత్యేక గుర్తింపునిస్తామని హామీ ఇచ్చారు. డ్రగ్స్, సైబర్ క్రైమ్ సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయని తెలిపారు. మీడియా కూడా వీటిపై ఫోకస్ పెంచాలని రిక్వెస్ట్ చేశారు. పోలీసులు కృషికి మీడియా కూడా తోడవ్వాలన్నారు. డ్రగ్స్ నియంత్రణ కోసం చిరంజీవి వీడియో సందేశం పంపారని.. డ్రగ్స్ నియంత్రణకు అలాంటి వాళ్లు చాలా మంది ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సమాజాన్ని కాపాడే బాధ్యత సినీ ఇండస్ట్రీపై ఉందని తెలిపారు. థియేటర్లలో డ్రగ్స్ నియంత్రణ కోసం ఉచితంగా వీడియో ప్రదర్శించాలన్నారు.