Maharashtra Elections : మహారాష్ట్ర ఎన్నికల స్టార్ క్యాంపెయినర్‌గా రేవంత్!

by Ramesh N |
Maharashtra Elections : మహారాష్ట్ర ఎన్నికల స్టార్ క్యాంపెయినర్‌గా రేవంత్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర ఎన్నికల star campaigner స్టార్ క్యాంపెయినర్లను నియమించారు. ఈ మేరకు బుధవారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ కుమారి సెల్జా 40 మంది స్టార్ క్యాంపెయినర్ల పేర్లతో ఎన్నికల సంఘానికి లేఖలో పేర్కొంది. మహారాష్ట్ర ఎన్నికల స్టార్ క్యాంపెయినర్‌గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి CM Revanth Reddy పేరు జాబితాలో ఉంది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీతో పాటు సీఎం రేవంత్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఉన్నారు.

ఇక Maharashtra Elections మహారాష్ట్రలో నవంబర్ 20వ తేదీన సింగిల్ ఫేజ్‌లో ఎన్నికలు జరగనుండగా.. జార్ఖండ్‌కు మాత్రం రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 13, 20 తేదీల్లో ఆ రాష్ట్రానికి ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. కాగా, ఇటీవల జరిగిన హర్యానా, జమ్ము కాశ్మీర్ అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర, జార్ఖండ్‌లో కూడా కర్ణాటక, Telangana తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రిపీట్ అయ్యేలా కాంగ్రెస్ అధిష్టానం వ్యూహం రచిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed