CM Revanth: చేవెళ్ల ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి

by Gantepaka Srikanth |
CM Revanth: చేవెళ్ల ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి
X

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల(Chevella) మండలం ఆలూరు స్టేజీ వద్ద కూరగాయలు అమ్ముకునే చిరు వ్యాపారులపైకి లారీ దూసుకెళ్లిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సదుపాయం అందించాలని అధికారులను ఆదేశించారు. కాగా, ప్రమాదంలో ఆరుగురు వ్యాపారులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

హైదరాబాద్‌ -బీజాపుర్‌ రహదారి పక్కన దాదాపు 50 మంది కూరగాయలు విక్రయిస్తుండగా.. వారిపైకి లారీ దూసుకెళ్లడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. దూసుకొస్తున్న లారీని చూసి అక్కడి జనమంతా భయంతో పరుగులు తీశారు. వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ చెట్టును ఢీకొట్టి ఆగింది. లారీ డ్రైవర్‌ మాత్రం క్యాబిన్‌లో ఇరుక్కుపోవడంతో అతడిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్‌లో అన్‌లోడ్‌ చేసి తిరిగి వికారాబాద్‌ వెళ్తున్న క్రమంలో లారీ అదుపుతప్పడంతో ఈ ఘటనకు చోటుచేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed