- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్‌కు ఏ దేవుడు కలలో వచ్చి చెప్పాడో.. CM రేవంత్ రెడ్డి సెటైర్
దిశ, వెబ్‌డెస్క్: పలానా చోటే మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు నిర్మించాలని పుర్రెలో పురుగు పుట్టిందే కేసీఆర్‌కు అని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్‌కు ఏ దేవుడు కలలోకి వచ్చి చెప్పారో తెలియదు.. ఆయనే ఇంజినీర్లకు సలహా ఇచ్చారని ఎద్దేవా చేశారు. తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మించాలని ఇంజినీర్ల కమిటీ స్పష్టం చేసింది.. మేడిగడ్డ వద్ద నిర్మిస్తే నిరుపయోగమని ఐదుగురు ఇంజినీర్ల కమిటీ తేల్చేసింది.. కానీ, అవన్నీ పక్కనబెట్టి.. కేసీఆర్ సొంతంగా నిర్ణయం తీసుకొని మేడిగడ్డను నిర్మించారని మండిపడ్డారు. ఇదే విషయాన్ని తొమ్మిదేళ్ల క్రితం మేడిగడ్డ మేడిపండేనా అని ఒక మిత్రుడు దిన పత్రికలో ఆర్టికల్ రాసిన విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు.
తెలంగాణ ఖాజానాను కొల్లగొట్టేందుకు ఇంత దుర్మార్గానికి తెగపడ్డారని సీరియస్ అయ్యారు. కేసీఆర్, హరీష్ కలిసి రాష్ట్రానికి ఎంత ద్రోహం చేశారో వాళ్లు తెలుసుకోవాలని సూచించారు. కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయిని కాదు.. తెలంగాణకు కళంకంగా మిగిలిపోయిందని చెప్పారు. క్షమాపణలు చెప్పాల్సిందిపోయి.. నిస్సిగ్గుగా సభలో నిలబడి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమను ప్రశ్నిస్తారా? అని మండిపడ్డారు. ప్రాజెక్టులు పగిలిపోతుంటే క్షమాపణలు చెప్పకుండా వాదించడం సిగ్గుచేటు అని అన్నారు. ఇరిగేషన్‌లో జరిగిన పాపాలన్నింటికీ కేసీఆర్, హరీష్ రావులే కారణమని అన్నారు. జరిగిన తప్పులకు క్షమాపణ హరీష్ చెప్పి.. సిట్టింగ్ జడ్జి విచారణకు వచ్చినపుడు ఎవరి ఒత్తిడితో ఇలా చేశారో కన్ఫెక్షన్ స్టేట్ మెంట్ ఇచ్చి ఒప్పుకోవాలని సూచించారు.