- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీ గౌరవం తగ్గించం.. కేసీఆర్‌కు CM రేవంత్ రెడ్డి కౌంటర్
దిశ, వెబ్‌డెస్క్: కేసీఆర్ నల్లగొండ బహిరంగ సభలో చేసిన కామెంట్లపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. మేడిగడ్డ వద్ద నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో సీఎం మాట్లాడుతూ.. చావు నోట్లో తల పెట్టానని కేసీఆర్ ఇంకెన్ని రోజులు చెబుతాడని ఎద్దేవా చేశారు. కేసీఆర్ సత్యహరిశ్చంద్రుడైతే అసెంబ్లీకి వచ్చి నిజాలు చెప్పాలని సవాల్ చేశారు. తెలంగాణ కోసం చచ్చేవరకు కొట్లాడానని చెబుతున్న కేసీఆర్.. అసెంబ్లీలో చర్చ పెడితే ఎందుకు రాలేదని ప్రశ్నించారు. నాలుగైదు పిల్లర్లు కూలితే పెద్ద సమస్యా? అని అంటున్నారు.. కళ్లకు కట్టినట్లు పగుళ్లు కనిపిస్తుంటే చిన్న సమస్య ఎలా అవుతుందని సీరియస్ అయ్యారు. నీళ్లు నింపితే మొత్తం ప్రాజెక్ట్ కూలిపోతుందని అన్నారు. ఇది కేసీఆర్ నిజస్వరూపం అని తెలిపారు.
కేవలం కేసీఆర్ దోపిడీకి కాళేశ్వరం బలైపోయిందని ఆరోపించారు. అడిగితే సలహాలు ఇస్తానని ఇప్పుడు చెబుతున్నాడు.. సభకు రావడానికి ఎందుకు భయపడుతున్నారని సెటైర్ వేశారు. సక్కగ లేని తీర్మాణానికి అసెంబ్లీలో హరీష్ రావు ఎలా మద్దతు ఇచ్చారని ప్రశ్నించారు. హరీష్ రావు మాటలకు విలువ లేదా? అని అడిగారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం గురించి ఎందుకు ప్రస్తావించలేదు అని అన్నారు. సీఎం కుర్చీ పోగానే నల్లగొండ నీళ్లు, ఫ్లోరైడ్ బాధితుల బాధలు ఎందుకు గుర్తొచ్చాయని అడిగారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయిన కేసీఆర్ గౌరవాన్ని తాము తగ్గించబోమని.. కానీ, చేసే సూచనలు అసెంబ్లీకి వచ్చి చేయాలని సూచించారు. కాళేశ్వరంపై ప్రజలకు అనేక అనుమానాలు ఉన్నాయని అన్నారు.