వ్యవసాయం తెలంగాణ ప్రజల భావోద్వేగం : సీఎం రేవంత్ రెడ్డి

by M.Rajitha |
వ్యవసాయం తెలంగాణ ప్రజల భావోద్వేగం : సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : జలసౌధ(Jalasoudh)లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో నీటి పారుదల శాఖలో నూతనంగా నిమితులైన 687 మంది ఏఈఈ(AEE)లకు సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు వ్యవసాయం భావోద్వేగంతో ముడిపడిన విషయం అన్నారు. ఇంజనీర్లుగా ఈ ఉద్యోగం మీకు కేవలం ఉద్యోగం మాత్రమే కాదని.. తెలంగాణ ప్రజల భావోద్వేగం అని గుర్తుపెట్టుకొని పని చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో కట్టిన ప్రాజెక్టులు దశాబ్దాల కాలం నుండి చెక్కుచెదరకుండా ఉన్నాయని, ఇందుకు ఉదాహరణ నాగార్జున సాగర్ గా చెప్పుకోవచ్చన్నారు. కమీషన్ల కోసం, గొప్ప కోసం ఆగమేఘాల మీద కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కనీసం ఐదేళ్లు కూడా నిలవలేదని పేర్కొన్నారు. ఇంజనీర్లుగా ఎలాంటి తప్పులు చేయకూడదో, ఎలాంటి అవినీతి జరగకుండా చూడాలో మీకు ఇది ఒక కేస్ స్టడీలాగా ఉపయోగపడుతుందని తెలిపారు. నిజాయితీగా పని చేసేవారిని కాంగ్రెస్ ప్రభుత్వం నెత్తిన పెట్టుకుంటుందని.. ఎవరైనా పైరవీల కోసం వస్తే, అవినీతికి పాల్పడినట్టు తెలిస్తే తిండి కూడా సరిగ్గా దొరకని ప్రాంతాలకు ట్రాన్సఫర్ అవుతారని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed