నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్

by Prasad Jukanti |
నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. నిరుద్యోగులు అధైర్య పడవద్దని మీ సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నుంచి యువతను గట్టెక్కిస్తాని చెప్పారు. బుధవారం ఎల్బీ స్టేడియంలో హోంశాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్తగా ఎంపికైన కానిస్టేబుల్‌ అభ్యర్థులకు ముఖ్యమంత్రి నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేసే బాధ్యత నేను తీసుకుంటానన్నారు. నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు. టీఎస్ పీఎస్సీని ప్రక్షాళన చేశామని, ఒక్కొక్క సమస్యను పరిష్కరిస్తూ ఉద్యోగ నియామకాల కోసం ప్రభుత్వం అహర్నిశలు పని చేస్తున్నామన్నారు.

ఉద్యోగాలు పొందిన మీ కళ్లలో ఆనందం చూస్తూనే నాకు నిద్ర పడుతుందని, మీరంతా మా తమ్ముళ్లు.. మీ ఆనందాన్ని మా మంత్రి వర్గం పంచుకుంటుందన్నారు. గత ప్రభుత్వంలో గ్రూప్- 1 పోస్టులు నియామకం జరగలేదు. అందువల్ల ఎవరికి నష్టం కలగకుండా వయోపరిమితి పెంచి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. ప్రభుత్వం, ప్రైవేట్ సెక్టార్ లో ఉద్యోగ, ఉపాధి కల్పించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పారు. ఈ రాష్ట్రంలో గంజాయి మొక్కలు ఉండొద్దు. నిరుద్యోగ యువకులారా ఈ రాష్ట్రం మీదేనన్నారు. మీ సమస్యలు పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed