విద్యార్థులకు భారీ శుభవార్త.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

by Gantepaka Srikanth |
విద్యార్థులకు భారీ శుభవార్త.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల(Government School)ల్లో చదువుకునే విద్యార్థుల(Students)కు సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) శుభవార్త చెప్పారు. తెలంగాణ(Telangana)లోని పర్యాటక ప్రాంతాలను, చారిత్రక కట్టడాలను ఉచితంగా సందర్శించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. దీని కోసం ‘తెలంగాణ దర్శిని(Telangana Darshini)’ అనే కొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడానికి ఇది దోహద పడుతుందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కాగా, రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల పునరుద్ధనకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

ఇందులో భాగంగానే సంబంధిత అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం సచివాలయం వేదికగా సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని పలు పురాతన మెట్ల బావుల పునరుద్ధరణకు చర్యలు చేపట్టింది. పురాతన కట్టడాలు కాపాడడమే లక్ష్యంగా సీఐఐతో రాష్ట్ర పర్యాటక శాఖ ఒప్పందం సైతం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా పురాతన బావులు దత్తత తీసుకునేందుకు పలువురు పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ రంగ సంస్థలు ముందుకొచ్చాయి. ఇకపై పురాతన బావులను ప్రక్షాళన చేసి పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు వారు చర్యలు చేపట్టనున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి వారికి ఒప్పంద పత్రాలు అందజేశారు.

Advertisement

Next Story

Most Viewed