- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
CM Revanth: ఆగస్టు 14 వరకు విదేశీ పర్యటన.. ఆ తర్వాతే రూ. 2 లక్షల రుణమాఫీ: సీఎం రేవంత్ రెడ్డి
by Mahesh |
X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ దాదాపు ఆరు నెలల తర్వాత రూ. లక్ష లోపు రైతు రుణాలను మాఫీ చేసింది. అలాగే రాష్ట్ర బడ్జెట్ లో కూడా రుణమాఫీకి అంచనా నిధులను కేటాయించిన సంగతి తెలిసిందే. కల్వకుర్తిలో కాంగ్రెస్ దివంగత నేత సూదిని జైపాల్‌రెడ్డి ఐదో వర్ధంతి సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభ, విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూలై 31 లోపు రెండో విడత కింద రూ.1.5 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పుకొచ్చారు. అలాగే.. ఆగస్టు 2 నుంచి 14 వరకు విదేశీ పర్యటనకు వెళ్తున్నానని.. తిరిగి వచ్చాక ఆగస్టు నెలలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఈ సభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి మరోసారి హామీ ఇచ్చారు.
Advertisement
Next Story