- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఢిల్లీ పోలీసుల నోటీసులు.. CM రేవంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్ ఇదే..!
దిశ, వెబ్‌డెస్క్: అమిత్ షా ఫేక్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసులు సోమవారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. తాజా నోటీసులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఢిల్లీ పోలీసులకు తాను భయపడేది లేదన్నారు. బీజేపీపై పోరాడే వారికే అమిత్ షా నోటీసులు ఇస్తున్నారన్నారు. బీజేపీని ప్రశ్నించినందుకే పోలీసుల నోటీసులు అని ఫైర్ అయ్యారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా.. ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులు వస్తున్నారని సీఎం మండిపడ్డారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ ఎన్నికల్లో తెలంగాణ, కర్ణాటకలో బీజేపీని ఓడించి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తనకు నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీ పోలీసులు వచ్చారని.. మోడీ ఇప్పటి వరకు విపక్షాలపై సీబీఐ, ఈడీని ప్రయోగించారన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు ఢిల్లీ పోలీసులనూ ప్రయోగిస్తున్నారని ముఖ్యమంత్రి ఫైర్ అయ్యారు.