CM Revanth: రాజలింగమూర్తి దారుణ హత్య.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం!

by Shiva |   ( Updated:2025-02-20 05:49:53.0  )
CM Revanth: రాజలింగమూర్తి దారుణ హత్య.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం!
X

దిశ, వెబ్‌డెస్క్: మేడిగడ్డ (Medigadda) లక్ష్మి బ్యారేజీ కుంగుబాటుపై కోర్టుకెక్కిన రాజలింగ మూర్తి (Rajalinga Murthy) దారుణ హత్యకు గురైన విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తాజాగా, ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సీరియస్ అయినట్లగా తెలుస్తోంది. హత్యకు సంబంధించి పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి ఆయన పూర్తి వివరాలు తెలుసుకున్నారు. రాజలింగ మూర్తి హత్య విషయంలో నిజాలు నిగ్గు తేల్చేందుకు సీఐడీ (CID) విచారణకు ఆదేశించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం.

కాగా, 2023లో కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project)లో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే (BRS Government) కారణమని రాజలింగమూర్తి న్యాయ పోరాటానికి దిగారు. ఈ మేరకు కేసులో కేసీఆర్‌ (KCR), హరీష్‌రావు (Harish Rao)లకు కోర్టు నోటీసులు ఇచ్చింది. అయితే, అనూహ్యంగా రాజలింగ మూర్తి (Rajalinga Murthy) బుధవారం సాయంత్రం దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేసి అతి కిరాతకంగా హతమార్చారు. ఈ మేరకు భూపాలపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. కేసీఆర్, మాజీ మంత్రులతో పాటు ప్రాజెక్ట్ పనులు చేపట్టి కాంట్రాక్ట్ కంపెనీలపై ఫిర్యాదు చేసిన రాజలింగమూర్తి హత్యకు గురికావడం పలు అనుమానాలు తావిస్తోంది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కేసును సీఐడీ (CID)కి అప్పగించే అవకాశాలు ఉన్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది.

2019లో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో మృతుడి భార్య నాగవెళ్లి సరళ (Nagavelli Sarala) భూపాలపల్లి‌లోని 15వ వార్డు నుంచి బీఆర్‌ఎస్‌ (BRS) తరఫున పోటీ చేసి కౌన్సిలర్‌గా గెలిచారు. కొద్ది నెలలకే ఆమెను పార్టీ నుంచి బహిష్కరించారు. బుధవారం రాత్రి మృతుడు రాజలింగ మూర్తి స్వగ్రామం జంగేడు శివారు పక్కీరుగడ్డలోని ఇంట్లో జరిగిన శుభకార్యానికి వెళ్లాడు. అక్కడ నుంచి బైక్‌పై భూపాలపల్లి (Bhupalapally)కి తిరిగి వస్తుండగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (Telangana Coal Mine Labor Union) ఎదురుగా రోడ్డు క్రాస్ చేస్తుంగా దుండగులు కాపు కాసి రాజలింగ మూర్తిని హతమార్చారు.

Next Story

Most Viewed