సీఎం రేవంత్ రెడ్డితో కొరియా రాయబారి బృందం భేటీ

by Ramesh N |
సీఎం రేవంత్ రెడ్డితో కొరియా రాయబారి బృందం భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇటీవల జపాన్ రాయబారి సుజుకి హిరోషి మర్యాదపూర్వకంగా కలిసిన విషయం తెలిసిందే. తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వం ప్రాధాన్యత రంగంలో ఉపాధి కల్పన తదితర అంశాలపై చర్చించారు.

ఈ క్రమంలోనే తాజాగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి‌తో రిపబ్లిక్ ఆఫ్ కొరియా రాయబారి బృందం భేటీ అయింది. శుక్రవారం సచివాలయంలో రిపబ్లిక్ ఆఫ్ కొరియా రాయబారి హెచ్ఈ చాంగ్ జే బోక్, ఆయన బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రిపబ్లిక్ ఆఫ్ కొరియా రాయబారిని సన్మానించి.. జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబుతో పాటు ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.

Advertisement

Next Story