చీము, నెత్తురు ఉంటే రాజీనామా చెయ్.. హరీష్ రావుకు CM రేవంత్ సంచలన సవాల్

by Gantepaka Srikanth |   ( Updated:2024-08-15 16:18:12.0  )
చీము, నెత్తురు ఉంటే రాజీనామా చెయ్.. హరీష్ రావుకు CM రేవంత్ సంచలన సవాల్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీష్ రావుకు సీఎం రేవంత్ రెడ్డి మరోసారి సంచలన సవాల్ విసిరారు. ప్రతిష్టాత్మక సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టును సీఎం ప్రజలకు అంకితం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసుగూడెంలో సీతారామ ప్రాజెక్టు రెండో పంప్ హౌజ్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం ప్రాజెక్టు పైలాన్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశామని అన్నారు. చీము, నెత్తురు ఉంటే హరీష్ రావు రాజీనామా చేయాలని ఘాటుగా సవాల్ చేశారు. లేకపోతే ముక్కు నేలకు రాసి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని.. ఈసారి సిద్దిపేటలో ఎలా గెలుస్తావో తామూ చూస్తామని వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేటలో కాంగ్రెస్‌ను గెలిపించే బాధ్యత స్వయంగా తానే తీసుకుంటానని రేవంత్ రెడ్డి ప్రకటించారు. బీఆర్ఎస్‌ను బద్దలు కొడతాం.. బీజేపీని బొందపెడతా అని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఇప్పుడెవరూ బీఆర్ఎస్ నేతల మాటలు వినే పరిస్థితుల్లో లేరని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పినా కేటీఆర్ ప్రవర్తన మార్చుకోవడం లేదని మండిపడ్డారు. ప్రజలే తప్పు చేశారనడం సిగ్గుచేటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2026 ఆగష్టు లోపు సీతారామ ప్రాజెక్ట్‌‌ను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేసి తీరుతామని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed