- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
CM Revanth: ఆనాడు ఆయనను సీఎంగా ప్రకటించి ఉంటే అధికారంలోకి వచ్చేవాళ్లం: రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్/ మహబూబ్ నగర్ బ్యూరో/కల్వకుర్తి: తెలంగాణ వచ్చిన 2014లో సీఎం అభ్యర్థిని ప్రకటించకపోవడం వల్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేకపోయిందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో కేంద్ర దివంగత మంత్రి జైపాల్‌రెడ్డి కాంస్య విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం రావడంలో జైపాల్‌రెడ్డి కీలక పాత్ర పోషించారని అన్నారు. అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఒప్పించడంలో జైపాల్‌రెడ్డి కీలక పాత్ర పోషించిన విషయం అందరికీ తెలిసిందేనని పేర్కొన్నారు.
రాష్ట్ర ఏర్పాటు అనంతరం సీఎం అభ్యర్థి ఎవరు అన్న విషయం తేల్చకపోవడం వల్లే కాంగ్రెస్ ఓడిపోయిందని అన్నారు. రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన జైపాల్ రెడ్డిని సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఉంటే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉండేదని పేర్కొన్నారు. 2006లో మీ అభిమానంతో జడ్పీటీసీగా పోటీ చేసి తాను విజయం సాధించానని గుర్తు చేశారు. అనంతరం ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలుపొందుతూ సీఎం స్థాయికి ఎదిగానని అన్నారు. ఇదంతా ప్రజల చలవ వల్లే సాధ్యం అయిందని అన్నారు. తాను నేను ముఖ్యమంత్రిని అయినా నల్లమల్ల ప్రాంత బిడ్డనే అన్న విషయాన్ని మర్చిపోలేదని అన్నారు.
నియోజకవర్గంలో రోడ్ల కోసం రూ.150 కోట్లు, తాను చదువుకున్న తాండ్ర పాఠశాలకు రూ.5 కోట్లు, ముచ్చింతలలో రూ.100 కోట్లతో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి ఆగస్టు 1న శ్రీకారం చుడతామని సీఎం రేవంత్ తెలిపారు. నియోజకవర్గాల్లోని అన్ని తండాలు గ్రామాలకు బీటీ రోడ్లు నిర్మిస్తామని అన్నారు. హైదరాబాద్- కల్వకుర్తి-శ్రీశైలం జాతీయ రహదారిని నాలుగు రోడ్ల రహదారిగా విస్తరించేందుకు కేంద్రంతో చర్చించామని గుర్తు చేశారు. ఆ పనుల కూడా త్వరలోనే ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. ఆగస్టులోపు రైతుల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చాం. గడుకు ముందే రూ.లక్ష రుణమాఫీ చేశామని ఈ నెల 31 లోపు రూ.1.5 లక్షల లోపు ఉన్న రుణాలను మాఫీ చేస్తామని స్పష్టం చేశారు.
అదేవిధంగా ఆగస్టులోపు రూ.2 లక్షల రుణాలను మాఫీ చేస్తామని పేర్కొన్నారు. తాను ఇన్ని చేస్తా ఉంటే ఒక నాయకుడు దూలంలా పెరిగినా.. దూడకు ఉన్న జ్ఞానం లేకుండా రాజీనామా చేస్తాను అన్నాడని హరీష్ రావును ఉద్దేశించి పరోక్షంగా సీఎం విమర్శించారు. ఇటీవల కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కాంగ్రెస్‌ను గెలిపించి ప్రజలు ఇబ్బందుల్లో పడ్డారని అంటున్నారని.. ఇబ్బందుల్లో పడింది ప్రజలు కాదు కేసీఆర్ కుటుంబం అనే విషయాన్ని వారు గుర్తించాలని అన్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే అసెంబ్లీలో మాట్లాడేందుకు తాము సరిపోతామని కేటీఆర్ అంటున్నాడని.. మా మాటలకు మరుసటి రోజు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చాడని ఎద్దేవా చేశారు.
ఎన్ని అడ్డంకులు వచ్చినా తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి తీరుతామని అన్నారు. ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసి చూపిస్తామని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలోనే వస్తున్నాయని గత ఎన్నికల్లో పార్టీని భుజాలపై వేసుకుని మోసిన నాయకులు, కార్యకర్తలను గుర్తించి వారికి పోటీ చేసే అవకాశం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, ఎంపీ డాక్టర్ మల్లు రవి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ చిన్నారెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ వంశీకృష్ణ, ఎన్నం శ్రీనివాస్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, రాజేష్ రెడ్డి, ఏఐసీసీ ప్రత్యేక ఆహ్వానితులు వంశీచందర్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, పీసీసీ అధికార ప్రతినిధి బాలాజీ సింగ్, తదితరులు పాల్గొన్నారు.