- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
CM Revanth: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యారంగం నిర్లక్ష్యానికి గురైంది.. సీఎం రేవంత్ హాట్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యారంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గత పదేళ్ల కాలంలో చాలా చోట్ల సింగల్ టీచర్ ఉన్న పాఠశాలలను మూసేశారని ఆరోపించారు. దేశ ప్రధాని నెహ్రూ విద్యా విప్లవాన్ని తీసుకొచ్చారని గుర్తు చేశారు. మారుమూల ప్రాంతాల్లో పాఠశాలలను ఏర్పాటు చేశారని తెలిపారు. తాము అధికారంలో వచ్చాక విద్యా శాఖకు అధిక నిధులు కేటాయించామని అన్నారు.
డీఎస్సీ ద్వారా 11 వేల టీచర్ల నియామకాలు చేపట్టామని అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వం పాఠశాలలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. అన్ని విశ్వవిద్యాలయాలకు వీసీలను నియమించామని అన్నారు. దేశంలో మొట్టమొదటిసారిగా విద్యా కమిషన్ ఏర్పాటు చేసిన ఘటన తెలంగాణ ప్రభుత్వానికి దక్కిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.