- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CM REVANTH: సీఎం రేవంత్‌రెడ్డి ఆంధ్ర పర్యటన ఖరారు.. అక్కడికి ఎందుకంటే?
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలుదీరి సీఎంగా ప్రయాణ స్వీకారం చేసిన రేవంత్‌రెడ్డి తొలిసారిగా విశాఖపట్టణానికి వెళ్లనున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 11న విశాఖ వేదికగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసే బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. అదేవిధంగా లోక్‌సభ ఎన్నికల సమయం సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరపున సీఎం ప్రచారంలో పాల్గొనున్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల, ఏఐసీసీ ఇంఛార్జ్ ఠాక్రే ఆహ్వానం మేరకు రేవంత్ ఏపీలో కాంగ్రెస్ తరపున ప్రచారం చేయనున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి మూడు సభల్లో పాల్గొనబోతున్నారని సమాచారం. మొదటి సభ ఈనెల 11న విశాఖలో జరుగనుంది. అయితే 11న ఉదయం భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొననున్న సీఎం రేవంత్‌రెడ్డి, అక్కడ నుంచి గన్నవరంకు చేరుకుంటారు. అక్కడ నుంచి విశాఖకు వెళ్తారని సీఎంవో వర్గాలు తెలిపాయి.