కాంగ్రెస్ వస్తే బంగాళాఖాతంలో పడేది ధరణి కాదు రైతులు: కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2023-11-13 10:41:25.0  )
కాంగ్రెస్ వస్తే బంగాళాఖాతంలో పడేది ధరణి కాదు రైతులు: కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో పడేస్తామంటోంది, కానీ కాంగ్రెస్ పవర్‌లోకి వస్తే బంగాళాఖాతంలో పడేది ధరణి కాదు రైతులని సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ బూర్గంపాడులో జరిగిన ప్రజా ఆశీర్వాధ సభలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళారుల రాజ్యం, లంచాల రాజ్యం వస్తుందని, రైతులు బాగుండాలంటే బీఆర్ఎస్‌నే గెలిపించాలని కేసీఆర్ కోరారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ గెలవాన్నారు. కాంగ్రెస్ వస్తే ధరణిని బంగాళాఖాతంలో వేస్తారని, అదే కనుక జరిగితే మీ భూములపై పెత్తనం మళ్లీ వేరేవాళ్లకు వెళ్తుందన్నారు. ధరణి తీసేస్తే రైతుబంధు, రైతు బీమా రావని పేర్కొన్నారు. ధాన్యం అమ్మిన కూడా డబ్బు సకాలంలో రాదని చెప్పారు. మణుగూరులో రావాల్సిన వీటీపీఎస్‌పై కుట్ర జరిగిందని, సమైక్యవాదుల కుట్రతో విజయవాడలో స్థాపించారని మండిపడ్డారు.

Advertisement

Next Story