గుడ్ న్యూస్.. దళిత బంధు పథకంపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన

by Satheesh |   ( Updated:2023-11-22 12:55:57.0  )
గుడ్ న్యూస్.. దళిత బంధు పథకంపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన దళిత బంధు పథకంపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం పరిగిలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాధ సభ నిర్వహించారు. ఈ సభకు హాజరై సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని దళితులంతా ధనికులు అయ్యే వరకు దళిత బంధు పథకం కొనసాగుతుందని హామీ ఇచ్చారు. ఎస్సీలు, ఎస్టీలను కాంగ్రెస్ పార్టీ కేవలం ఓటు బ్యాంక్‌గానే చూసిందని.. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం దళితులు ఆర్థికంగా ఎదగడం కోసం దళిత బంధు స్కీమ్ తీసుకు వచ్చామని తెలిపారు.

కులవృత్తాలను ప్రోత్సాహించడానికే గొర్రెలు, చేప పిల్లలు పంపిణీ చేస్తు్న్నామన్నారు. తెలంగాణ ప్రజల హక్కుల కోసమే పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అని స్పష్టం చేశారు. తాను పదవుల కోసం ఎప్పుడు కొట్లాడలేదని.. ప్రజల దయ వల్ల రెండు సార్లు సీఎం అయ్యాయని తెలిపారు. ఎన్నో అవమానాలు, బలిదానాలతో సాధించకున్న తెలంగాణ రాష్ట్రం ఆగం కావొద్దనేది తన తాపత్రయం అని అన్నారు. బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే.. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది మిషన్ మోడ్‌లో పేదలకు ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed