బీజేపీ పాలిత రాష్ట్రాలపై నజర్.. సీఎం KCR కీలక నిర్ణయం?

by Sathputhe Rajesh |   ( Updated:2022-09-03 07:31:38.0  )
బీజేపీ పాలిత రాష్ట్రాలపై నజర్.. సీఎం KCR కీలక నిర్ణయం?
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీఆర్ఎస్, బీజేపీ మధ్య పొలిటికల్ వార్ ముదురుతోంది. రోజురోజుకు ఈ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్రతరం అవుతోంది. నువ్వు ఒకటి అంటే నేను రెండు అని చూపిస్తా అన్నట్లుగా వ్యవహారం సాగుతోంది. బీజేపీ టార్గెట్ గా కేసీఆర్ మరోసారి జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టడంతో దేశవ్యాప్తంగా కేసీఆర్ పై చర్చ జరుగుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పర్యటించిన కేసీఆర్.. తాజాగా బిహార్ లో పర్యటన చేసి దేశ రాజకీయాలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చించారు. నేషనల్ పాలిటిక్స్ పై మరింత దూకుడు పెంచాలని భావిస్తున్న కేసీఆర్.. ఆ దిశగా చకచక ప్రణాళికలు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ క్రమంలో రాబోయే రోజుల్లో మరిన్ని నార్త్ ఇండియా స్టేట్స్ లో ఆయన పర్యటించబోతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా యూపీ, మహారాష్ట్రలో బహిరంగ సభలు నిర్వహించబోతున్నారట. ఇప్పటికే ఈ రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల నేతలతో ప్రగతి భవన్ లో చర్చలు జరిపిన ముఖ్యమంత్రి.. రైతు సమస్యలే ఎజెండాగా మోడీ సర్కార్ కు చెక్ పెట్టేందుకు సిద్దమయ్యారట. ఈ మేరకు ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్రలో సభల నిర్వహణకు కార్యాచరణ సైతం రూపొందించినట్లు టాక్ వినిపిస్తోంది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో లక్ష మంది రైతులతో సభ నిర్వహించేలా ప్రణాళిక వేశారని, త్వరలో ఈ సభ తేదీ, వివరాలు ఖరారు చేయనున్నారని తెలుస్తోంది.

వారికి ప్రత్యేక పాసులు

యూపీ, మహారాష్ట్రలు బీజేపీ పాలిత రాష్ట్రాలు కావడంతో ఈ సభలను ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని కేసీఆర్ భావిస్తున్నారట. అయితే ఈ సభలకు హాజరయ్యే రైతులకు ప్రత్యేకంగా గుర్తింపు కార్డులు ఇవ్వాలనే అభిప్రాయంతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సభలు నిర్వహించడం ద్వారా మోడీపై కేసీఆర్ ప్రత్యక్ష యుద్ధానికి సన్నద్దమవుతున్నారని రాజకీయ వర్గాల్లో విశ్లేషణలు వ్యక్తం అవుతున్న వేళ ఈ సభలకు జన సమీకరణకు ప్రత్యేక ఏర్పాట్లు చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. బీజేపీ ఇలాకాలో కేసీఆర్ వేస్తున్న ఈ సభల స్కెచ్ ఏ మేరకు సక్సెస్ అవుతాయి? జనాలు ఏ మేరకు తరలి వస్తారనేది కాలమే సమాధానం చెప్పనుంది.

Also Read : మరో జమ్మిక్కుకు కేసీఆర్ ప్లాన్.. విలీనమా.. విమోచనమా.. విద్రోహమా?

Advertisement

Next Story