- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రాష్ట్రవ్యాప్తంగా న్యూట్రిషన్ కిట్స్.. ఒక్కో కిట్ విలువ ఎంతో తెలుసా?
దిశ, తెలంగాణ బ్యూరో: ‘న్యూట్రిషన్ కిట్స్’ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే ఫైల్ పై ఆదివారం సీఎం కేసీఆర్ నూతన సచివాలయంలో సంతకం చేశారు. రక్తహీనత అధికంగా ఉన్న తొమ్మిది జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ఇప్పటికే అమలు చేస్తున్నారు. గతేడాది డిసెంబరు 22 నుంచి ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, కుమురం భీమ్ ఆసిఫాబాద్, ములుగు, నాగర్ కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో ఈ కిట్లను పంపిణీ చేస్తున్నారు. ఇప్పుడు మిగతా 24 జిల్లాల్లో కిట్స్ పంపిణీ వైద్యారోగ్యశాఖ ప్రారంభించనున్నది. ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్, ఐరన్లతో కూడిన పోషకాహారాన్ని అందించి, రక్త హీనత తగ్గించడం, హెమోగ్లోబిన్ శాతాన్ని పెంచడం న్యూట్రీషన్ కిట్ల లక్ష్యం.
13.08 లక్షల కిట్ల పంపిణీ
రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలో 6.84 లక్షల మంది గర్భిణులకు 1046 కేంద్రాల ద్వారా 13.08 లక్షల కిట్లు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక్కో కిట్ విలువ రూ.2వేలు కాగా, మొత్తం రూ. 277 కోట్లు ఖర్చవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. 14-26 వారాల మధ్య జరిగే రెండో ఏఎన్‌సీ చెకప్ సమయంలో ఒకసారి, 27-34 వారాల మధ్య చేసే మూడో ఏఎన్‌సీ చెకప్ సమయంలో రెండో సారి ఈ కిట్లను ఇవ్వనున్నారు. ఈ కిట్ కిలో న్యూట్రీషన్ మిక్స్ పౌడర్, ఖర్జూర, ఐరన్ సిరప్ బాటిల్స్, నెయ్యి, పల్లీ పట్టీ తదితర పదార్థాలు ఉండనున్నాయి.
తల్లీబిడ్డల ఆరోగ్యం కోసమే: మంత్రి హరీశ్ రావు
మాతా శిశు సంరక్షణకు ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. తల్లి ఆరోగ్యం కోసం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్, బిడ్డల కోసం కేసీఆర్ కిట్లను అందజేస్తున్నది. కేంద్ర ప్రభుత్వ శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే ప్రకారం రాష్ట్రంలో మాతృ మరణాల రేటు 92 నుంచి 43కు తగ్గింది. ఈ సంఖ్యను మరింత తగ్గించేందుకు కృషి చేస్తున్నాం.