- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కొత్త సెక్రటేరియట్‌లో సీఎం కేసీఆర్ సంతకాలు చేసిన ఫైళ్ళు ఇవే!
దిశ, తెలంగాణ బ్యూరో: కొత్త సచివాలయంలోని ఛాంబర్‌లో ఆసీనులైన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరు ఫైళ్ళ మీద సంతకాలు చేశారు. ప్రస్తుత బడ్జెట్‌లో నిధులను కేటాయించిన పథకాలతో పాటు గతంలో హామీ ఇచ్చిన పలు విధానపరమైన నిర్ణయాలకు సంబంధించినవి అందులో ఉన్నాయి. కొన్ని అసెంబ్లీ వేదికగా ప్రకటించినవి కాగా మరికొన్ని వివిధ సందర్భాల్లో హామీలుగా ఇచ్చినవి. ప్రభుత్వం పేర్కొన్న వివరాల ప్రకారం సీఎం కేసీఆర్ తొలి రోజున సంతకాలు చేసిన పైళ్ళు ఇవీ..
= ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దళితబంధు పథకాన్ని హుజూరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ మినహా రాష్ట్రంలోని మిగిలిన 118 నియోజకవర్గాల్లో 1,100 లబ్ధిదారుల చొప్పున వర్తింపచేయాలనే ఫైలు.
= అటవీ ప్రాంతాల్లో పోడు సాగుచేస్తున్న 1.35 లక్షల మంది ఆదివాసీ రైతులకు 3.90 లక్షల ఎకరాలకు సంబంధించిన పట్టాల పంపిణీ మే నెల నుంచి మొదలుపెట్టే ఫైల్.
= సీఎంఆర్ఎఫ్ (ముఖ్యమంత్రి సహాయనిధి) కింద లబ్ధిదారులకు ఆర్థిక సాయాన్ని అందించే ఫైల్.
= గర్భిణీలకు పౌష్టికాహారాన్ని అందించే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్‌ను రాష్ట్రంలోని 6.84 లక్షల మందికి తలా రెండు చొప్పున మొత్తం 13.08 లక్షల కిట్లను పంపిణీ చేసే ఫైల్.
= రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే ఫైల్.
= పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించిన ఫైల్.