- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అదే కనుక జరిగితే.. దళిత బంధు, ధరణి పోర్టల్ క్లోజ్: కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీపై సీఎం కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం భువనగిరిలో బీఆర్ఎస్ తలపెట్టిన ప్రజా ఆశీర్వాద సభకు హాజరై ఆయన మాట్లాడారు. భువనగిరిలో కాంగ్రెస్ అరాచక శక్తులను పెంచి పోషించిందని ఆరోపించారు. ఆ అరాచక మూకలను బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఏరి పారేసిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్, దళిత బంధు ఆపేస్తారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ దళారుల రాజ్యం నడుస్తోందని పేర్కొన్నారు.
24 గంటలు ఇచ్చే బీఆర్ఎస్ కావాలా.. మూడు గంటలు చాలు అని కాంగ్రెస్ పార్టీ కావాలా అని ఈ సందర్భంగా కేసీఆర్ ప్రశ్నించారు. రైతులే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ సూచించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ 50 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుస్తోందని దీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తే భువనగిరికి ఐటీ, ఇండస్ట్రీయల్ పార్క్ ఇస్తామని హామీ ఇచ్చారు.