- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మునుగోడు ఉప ఎన్నికపై KCR సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: ప్రగతిభవన్ వేదికగా జరిగిన టీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నికలో తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఉప ఎన్నికలో రెండో స్థానంలో కాంగ్రెస్, మూడో స్థానంలో బీజేపీ ఉంటుందని జోస్యం చెప్పారు. ప్రతి ఎమ్మెల్యేకు రెండు గ్రామాల బాధ్యతలు అప్పగించామని, ఈ బైపోల్‌లో తమ గెలుపును ఎవరూ ఆపలేరని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు భయపడేది లేదని వ్యాఖ్యానించారు. అసలు బీజేపీ బెదిరింపులను పట్టించుకోవాల్సిన పనిలేదని తోసిపుచ్చారు. ఇతర రాష్ట్రాల్లో బీజేపీ ఆడిట ఆటలు ఇక్కడ సాగవని ఎద్దేవా చేశారు.
కాగా, టీఆర్ఎస్ఎల్పీ సమావేశానికి ముందు జరిగిన రాష్ట్ర కేబినెట్ మీటింగ్‌లో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2022 సెప్టెంబర్ 17ను 'తెలంగాణ జాతీయ సమైక్యతా దినం'గా పాటించాలని కేబినెట్ నిర్ణయించింది. సెప్టెంబర్ 16, 17, 18 తేదీలల్లో మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా.. 'తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల' ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేబినెట్ సమావేశం నిర్ణయించింది.
ఇవి కూడా చదవండి : NTR vs KCR.. మధ్యలోకి దూరిన కళ్యాణ్ రామ్?