నిజామాబాద్ జిల్లా అభివృద్ధి, పెండింగ్ పనులపై సీఎం కేసీఆర్ సమీక్ష

by samatah |   ( Updated:2022-11-27 08:50:38.0  )
CM KCR Announces New Pensions will be given from 15 August
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు, పెండింగ్ పనులపై సీఎం కేసీఆర్ ఆదివారం ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. ఇప్పటి వరకు పూర్తి అయిన పనులు, పెండింగ్ పనుల పురోగతిపై చర్చించారు. ఇక మీదట జిల్లాల వారీగా సీఎం కేసీఆర్ సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు.

ఈ కార్యక్రమానికి మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, గణేష్ గుప్తా, షకీల్ అహ్మద్, ఎమ్మెల్సీ కవిత, మునిసిపల్ అధికారులు హాజరయ్యారు. అంతేకాకుండా, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ చిత్ర మిశ్రా, పలువురు అధికారులు హాజరయ్యారు.

Advertisement

Next Story

Most Viewed