- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇరకాటంలో ఈటల.. పక్కా వ్యూహంతోనే 18 సార్లు ప్రస్తావించిన కేసీఆర్?
దిశ, తెలంగాణ బ్యూరో: నిన్నటివరకు ఈటల రాజేందర్ నీడను కూడా భరించలేకపోయిన ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్ సమావేశాల ముగింపు రోజున మాత్రం అసెంబ్లీలో ఆయన పేరును ప్రస్తావించారు. కొన్ని సందర్భాల్లో ఆయనను ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు అందిస్తున్న సన్నబియ్యం ఆలోచన ఈటల రాజేందర్‌దేనని గుర్తుచేశారు. విద్యార్థుల ఇబ్బందులను ఆయన తన దృష్టికి తీసుకొచ్చి ప్రతిపాదన పెట్టిన వెంటనే సమ్మతించినట్లు పేర్కొన్నారు. ఇప్పుడు బీసీ కులాలకు రాష్ట్ర ప్రభుత్వం కట్టిస్తున్న సంక్షేమ భవన్‌ల కాన్సెప్ట్ కూడా ఆయనదేనని, ఆ భవన్‌లకు టైటిల్ పెట్టింది కూడా ఆయనేనని గుర్తుచేశారు. ఇప్పుడు డైట్ చార్జీలు పెంచాల్సిందిగా అసెంబ్లీ వేదికగా ఆయన విజ్ఞప్తి చేశారని, తప్పకుండా ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఆయన విజ్ఞప్తి చేసినందుకే ప్రభుత్వం పెంచాలనే నిర్ణయం తీసుకున్నదన్నారు.
బడ్జెట్ సమావేశాల్లో చివరి రోజైన ఆదివారం జరిగిన ద్రవ్య వినియమ బిల్లుపై చర్చకు ముఖ్యమంత్రి బదులిస్తున్న సమయంలో రెండున్నర గంటల తన ప్రసంగంలో ఈటల రాజేందర్ పేరును 18 సార్లు ప్రస్తావించారు. సాగునీటిపారుదల రంగంలో ఈటల రాజేందర్ ప్రస్తావించిన అంశాలను పరిగణనలోకి తీసుకున్నామని, ఆయన చేసిన సూచనలపై కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందన్నారు. ఈటల రాజేందర్ పార్టీ మారినా, అసెంబ్లీలో ఆయన సీటు ఇటు నుంచి అటు మారినా ఆయనకు రాష్ట్రంలోని అన్ని సమస్యలూ తెలుసన్నారు. సాగునీటిరంగంలో తెలంగాణ ప్రభుత్వం తొమ్మిదేళ్ళ కాలంలో ఎదుర్కొన్న ఇబ్బందులు ఆయనకు తెలియనివి కావన్నారు.
కేంద్ర ప్రభుత్వం సకాలంలో పర్మిషన్లు ఇవ్వకపోవడంతో ఢిల్లీ వెళ్ళి ఎంత కష్టపడ్డదీ, కోర్టుల్లో రకరకాల పిటిషన్లు పడితే వాటి నుంచి బయటపడడానికి చేసిన ప్రయత్నాలు.. ఇవన్నీ ఈటల రాజేందర్‌కు తెలుసు అని కేసీఆర్ గుర్తుచేశారు. ఇంతకాలం బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఇప్పుడు మరో పార్టీలోకి వెళ్ళిపోయారన్న అభిప్రాయంతో 'ఈటల రాజేందర్ చెప్పారు కాబట్టి చేయం అనొద్దు.. కావాలంటే ఈటల రాజేందర్‌కు ఫోన్ చేసి సలహాలు తీసుకోండి' అని మంత్రులు, పార్టీ నేతలకు సూచించారు. డైట్ చార్జీల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకునే సమయంలో అసెంబ్లీ వేదికగా విజ్ఞప్తి చేసిన ఈటల రాజేందర్ అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని అధికారులకు సూచించారు.
అంతకు ముందు బడ్జెట్‌కు సంబంధించిన అంశాలను వివిధ సెక్షన్ల ప్రజలపై వేసే ప్రభావం గురించి ఈటల రాజేందర్ మాట్లాడుతుండగా కూడా కేసీఆర్ జోక్యం చేసుకున్నారు. సమస్యలను రెండుసార్లు చెప్పకుండా ఒకేసారి కంటిన్యూగా చెప్పాలని సూచించారు. ఆయన లేవనెత్తే సమస్యలను, వాటి వివరాలను నోట్ చేసుకోవాల్సిందిగా మంత్రి హరీశ్‌రావుకు సూచించారు. మార్కెట్ ఇంటర్‌వెన్షన్ స్కీమ్ అమలులో భాగంగా ప్రభుత్వం కొంత ఫండ్ కేటాయించాలన్న సంగతి ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పుడు ఈటల రాజేందర్‌కు స్పష్టంగా తెలుసని మరో సందర్భంలో కేసీఆర్ గుర్తుచేశారు. రాష్ట్రంలో వివిధ సెక్షన్ల ప్రజలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి కాబట్టే ఈటల రాజేందర్ మాట్లాడుతున్నారని, వాటిని ప్రభుత్వం పరిష్కరిస్తుందని సీఎం కేసీఆర్.
ఇంతకాలం అసెంబ్లీలో ఆయన ముఖం చూడడానికి కూడా ముఖ్యమంత్రికి ఇష్టం లేదని, అందువల్లనే అసెంబ్లీ సమావేశాల్లో ఆయన ఉన్న సమయంలో కేసీఆర్ హాజరుకాలేదన్న అంశాన్ని బీఆర్ఎస్ నేతలే గుర్తుచేశారు. దాదాపు సంవత్సరం పాటు అసెంబ్లీ సమావేశాల్లో ఆయన హాజరుకాకుండా వివిధ కారణాలతో సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈసారి కూడా అలాంటిది రిపీట్ అవుతుందనే పలువురు సభ్యులు, బీజేపీ నేతలు భావించారు. కానీ అలాంటిదేదీ లేకుండా హాజరయ్యే అవకాశం కల్పించడం వెనక కారణం చివరి రోజున ఆయనను ప్రశంసలతో ముంచెత్తి పలుమార్లు ఆయన పేరును పాజిటివ్ కోణంలో కేసీఆర్ ప్రస్తావించడంతో తేటతెల్లమైంది. వేరే పార్టీలో ఉన్నా ఆయన తమ మనిషే అనే అర్థంలో కామెంట్ చేయడం గమనార్హం.
ఈ సెషన్‌లో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు సైతం వేర్వేరు సందర్భాల్లో ఈటల రాజేందర్‌తో మాట్లాడడం వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను ఆశ్చర్యానికి గురిచేసింది.
ఇవి కూడా చదవండి : బిగ్ న్యూస్: CM కేసీఆర్‌కి దెబ్బ మీద దెబ్బ.. వరుసగా బెడిసి కొడుతోన్న వ్యూహాలు!