- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా ప్రాణం పోయిన సరే ఆ పని జరగదు: సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఏర్పాటు కాకముందు కొన్ని జిల్లాలకు వెళ్తే నాకు ఏడుపు వచ్చేదని సీఎం కేసీఆర్ అన్నారు. జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల పరిస్థితి చూస్తే దీనంగా ఉండేది.. ఉద్యమ సమయంలో బచ్చన్నపేటకు వెళ్తే ఊరిలో ఒక్క యువకుడు కనిపించలేదు.. ఊరిలోని యువకులు అంతా పొట్ట చేత పట్టుకుని వలస వెళ్లారని తెలిసిందని అన్నారు. సోమవారం జనగాంలోని మెడికల్ కాలేజీ గ్రౌండ్‌లో బీఆర్ఎస్ తలపెట్టిన ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో జనగాం పరిస్థితులు దారుణంగా ఉండేవని గుర్తు చేశారు. అప్పటి పరిస్థితి చూసి కన్నీళ్లు పెట్టుకున్నానని తెలిపారు. ఎన్నికలు రాగానే నోటికి వచ్చినట్లు మాట్లాడి వెళ్లిపోతారని.. అలాంటి వారి మాటలు నమ్మెద్దన్నారు. జనగాంకు త్వరలోనే దేవాదుల, కాళేశ్వరం నుండి నీళ్లు రాబోతున్నాయన్నారు. ఎక్కడ కరువు వచ్చిన జనగాంలో మాత్రం రాదని అన్నారు. తెలంగాణ వచ్చాక నాలుగైదు నెలలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మేథోమధనం చేశామన్నారు.
కరెంట్ కష్టాలు, నీటి కొరత లేదు, పుట్లకొద్ది పండుతున్నాయి... ఇప్పుడు తెలంగాణ ఎలా ఉందని అన్నారు. రైతుల బాధలు తనకు తెలుసని.. అందుకే భూమిపై అధికారుల అధికారాన్ని తీసేసి.. మీ భూమి మీద మీకే అధికారాన్ని ఇచ్చామని తెలిపారు. కానీ పాస్ బుక్‌లో కౌలు రైతులను చేర్చాలని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారని.. నా ప్రాణం పోయిన ధరణి తీసే పరిస్థితి లేదని కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
టీపీసీసీ చీఫ్, సీఎల్పీ నేత భట్టి ధరణిని తీసి బంగాళాఖాతంలో వేస్తారట అని మండిపడ్డారు. ధరణిని కాదు కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో పడేయాలని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే మళ్లీ వీఆర్వోలు వస్తారని అన్నారు. ఎన్నికలు రాగానే కనిపించే వాళ్ల మాటలు నమ్మెద్దని.. ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దని.. మంచి చెడు ఆలోచించి ఓటేయ్యండని కేసీఆర్ సూచించారు.