ఎటు చూసినా ఆకలి కేకలు.. ఆత్మహత్యలే: CM కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2023-08-15 06:10:50.0  )
ఎటు చూసినా ఆకలి కేకలు.. ఆత్మహత్యలే: CM కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం గోల్కోండ కోటలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని సీఎం కేసీఆర్ జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం కేసీఆర్ రాష్ట్ర ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం నడించిందని.. అహింసా మార్గంలోనే స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తు చేశారు. గత పాలకుల చేతిలో తెలంగాణ చితికి పోయిందని.. గత ప్రభుత్వాల తీరుతో రైతన్నల జీవితాలు బలైపోయాయని విమర్శించారు.

గతంలో ఎటు చూసినా ఆకలి కేకలు.. ఆత్మహత్యలే అని అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణాన్ని ఒక యజ్ఞంగా నిర్వహించామని.. విధ్వంసమైన తెలంగాణను విజయంపథం వైపు నడిపించామన్నారు. అనతి కాలంలోనే తెలంగాణ తిరుగులేని విజయాలు సాధించిందని.. తెలంగాణ ఆచరిస్తోంది.. దేశ అనుసరిస్తోందనే పేరు తెచ్చామని వ్యాఖ్యానించారు. ఒకప్పుడు రైతులు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావని, గంజి కేంద్రాలతో ఆదుకోవాల్సిన దుస్థితి ఉండేదని గుర్తు చేశారు.

బీఆర్ఎస్ హాయంలో ఇవాళ నిరంతరం విద్యుత్ ప్రసారంతో తెలంగాణ వెలుగిపోతుందన్నారు. ఒకప్పుడు చుక్క నీటి కోసం అలమటించిన తెలంగాణలో నేడు జలధారులు పారుతున్నాయన్నారు. భారతదేశంలో వనరులు పుష్కలంగా ఉన్నాయని.. పాలకుల అసమర్థతో వాటిని సంపూర్ణంగా వినియోగించడం లేదని అన్నారు. 75 ఏళ్ల ప్రగతి ఘనమే అయిన దేశంలో ఇంకా చేయాల్సింది చాలా ఉందన్నారు. బీఆర్ఎస్ ప్రజల ఆశయాలు, అవసరాలకు అనుగుణంగా పని చేస్తూ వచ్చిందని అన్నారు. దేశం ఆశించిన లక్ష్యాలను ఇంకా చేరుకోలేదన్నారు.

Read more : బ్రేకింగ్: పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్‌పై సీఎం KCR కీలక ప్రకటన

Advertisement

Next Story

Most Viewed