ధరణి వద్దన్న వాళ్లకు మీరే సమాధానం చెప్పాలి: సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2023-06-12 13:23:18.0  )
ధరణి వద్దన్న వాళ్లకు మీరే సమాధానం చెప్పాలి: సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఒకప్పుడు వలస పోయిన పాలమూరు.. ఇప్పుడు ఇతర రాష్ట్రాల కార్మికులకు ఉపాధినిస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. సోమవారం గద్వాల్‌లో బీఆర్ఎస్ తలపెట్టిన భారీ బహిరంగ సభకు కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలమూరులో గతంలో 14 రోజులకు ఒకసారి తాగునీరు దొరికేదని.. కానీ ఇప్పుడు మిషన్ భగీరథతో మన ఆడపడుచులకు ఇంటి వద్దకే తాగునీరు వస్తోందని అన్నారు.

పరిపాలన సంస్కరణల్లో భాగంగానే గద్వాల్‌ను జిల్లా చేశామని తెలిపారు. గద్వాల్ జిల్లాలో ఎన్నో మంచి పనులు చేసుకుంటున్నామని.. జిల్లా నుండి ఇద్దరు మంత్రులు తెలంగాణ ఉద్యమకారులే అని అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు. ఇక.. మీరు ధరణి కావాలంటున్నారు.. కొన్ని పార్టీలు వద్దంటున్నాయని.. ధరణి ఉండాలా వద్దా మీరే చెప్పాలని ప్రజలను కోరారు. ధరణి వద్దనే వాళ్లకు మీరే సమాధానం చెప్పాలన్నారు. ధరణి ఉన్నందుకే.. రాష్ట్రంలో భూ రాబందులు లేరన్నారు.

Also Read: Delhi Liquor Scam: లొంగిపోయిన మాగుంట రాఘవ

Advertisement

Next Story