ఏం ఇచ్చినా.. సిద్దిపేట రుణం తీర్చుకోలేను: సీఎం కేసీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Satheesh |   ( Updated:2023-10-17 13:21:30.0  )
ఏం ఇచ్చినా.. సిద్దిపేట రుణం తీర్చుకోలేను: సీఎం కేసీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతి సందర్భంలో సిద్దిపేట నన్ను విజేతగా నెలబెట్టింది, సిద్దిపేట పేరు వింటే స్వర్గం కంటే నా జన్మభూమి గొప్పది అనే భావన కలుగుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. మంగళవారం సిద్దిపేటలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. ఈ సభకు హాజరై సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. సిద్దిపేట తనను సీఎంను చేసిందని.. ఏం ఇచ్చిన సిద్దిపేట రుణాన్ని తీర్చుకోలేనని అన్నారు. సిద్దిపేటలో నేను తిరగని రోడ్డు, గ్రామం, చెరువు లేదు.. 50 ఏళ్లు సిద్దిపేట ప్రజలతో కలిసిమెలసి బతికానని చెప్పారు. సిద్దిపేట మంచి నీళ్ల పథకమే.. మిషన్ భగీరథకు స్ఫూర్తి అని చెప్పారు.

తెలంగాణ ఉద్యమానికి పునాది వేసింది సిద్దిపేట గడ్డ అని గుర్తు చేశారు. కేంద్రమంత్రిగా నేను వెళ్లాల్సి వచ్చినప్పుడు ఆరడుగుల బుల్లెట్ హరీష్ రావును మీకు అప్పగించానని.. హరీష్ రావు నా కంటే ఎక్కువ సిద్దిపేటను అభివృద్ధి చేశాడని కొనియాడారు. సిద్దిపేటలో ఎమ్మెల్యేగా నేను ఉన్నా.. హరీష్ రావు మాదిరిగా అభివృద్ధి చేయలేకపోయేవాడనని అన్నారు. హరీష్ రావు పట్టుబట్టి సిద్దిపేటకు ఐటీ హబ్ తీసుకువచ్చారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో హరీష్ రావును లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కేసీఆర్ కోరారు.

Advertisement

Next Story

Most Viewed