- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మోదీ పర్యటనకు సీఎం కేసీఆర్ మరోసారి డుమ్మా
దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని మోదీ పర్యటనకు సీఎం కేసీఆర్ మరోసారి డుమ్మా కొట్టారు. తెలంగాణ పర్యటనకు వచ్చిన మోదీకి కేసీఆర్ స్వాగతం పలకలేదు. అలాగే మహబూబ్‌నగర్‌లో పలు అభివృద్ది పనులకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయగా.. ఈ కార్యక్రమాల్లో కూడా మోదీతో కలిసి కేసీఆర్ పాల్గొనలేదు. మోదీ పర్యటనకు కేసీఆర్ గైర్హాజరు కావడం ఇది తొలిసారి కాదు. బీజేపీతో రాజకీయ వైరం నేపథ్యంలో గత కొన్నేళ్లుగా మోదీ పర్యటనలకు కేసీఆర్ పూర్తిగా దూరంగా ఉంటున్నారు. గత కొద్దిరోజులుగా కేసీఆర్ వైరల్ ఫీవర్‌తో బాధపడుతుండటంతో ప్రగతిభవన్‌కు మాత్రమే పరిమితమయ్యారు. ఫీవర్ ఇంకా తగ్గకపోవడంతో మోదీ పర్యటనలో కేసీఆర్ పాల్గొనలేదని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
ఢిల్లీ నుంచి మోదీ ఆదివారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసై స్వాగతం పలకగా.. ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో మహబూబ్‌నగర్‌కు మోదీ వెళ్లారు. అక్కడ పలు అభివృద్ది పనులను ప్రారంభించారు. అనంతరం బీజేపీ నిర్వహిస్తున్న బహిరంగ సభలో మోదీ మాట్లాడనున్నారు. ఈ సభ నుంచి తెలంగాణ ఎన్నికలకు మోదీ శంఖారావం పూరించనున్నారు.
Read More..