పాలమూరు జిల్లాకు సీఎం కేసీఆర్ వరాల జల్లు

by GSrikanth |   ( Updated:2022-12-04 14:31:58.0  )
పాలమూరు జిల్లాకు సీఎం కేసీఆర్ వరాల జల్లు
X

దిశ, వెబ్‌డెస్క్: మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా వెయ్యి చొప్పున ఇండ్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేగాక, తనను తొలిసారి ఎంపీగా గెలించిన జిల్లా కావడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలకు రూ.15 కోట్ల చొప్పున ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మీద విషం కక్కడమే లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం పనిచేస్తోందని మండిపడ్డారు. ఎనిమిదేళ్లలో దేశానికి బీజేపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. కేంద్రం పనితీరు 'పైన పటారం, లోన లోటారం' లాగా ఉందని సెటైర్లు వేశారు.

Advertisement

Next Story