- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆదివాసీ-బంజారాల ఆత్మీయ సభలో కేసీఆర్ వరాల జల్లు
దిశ, డైనమిక్ బ్యూరో: దళితబంధు మాదిరిగా త్వరలో గిరిజన బంధు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. భూమి లేకుండా, ఏ ఆదరణ లేకుండా ఉన్న గిరిజన బిడ్డల కోసం గిరిజన బంధును వెసులు బాటును తానే స్వయంగా ప్రారంభిస్తానన్నారు. అలాంటి వారికి రూ.10 లక్షలు ఇస్తామన్నారు. శనివారం హైదరాబాద్‌లోని ఎన్డీఆర్ స్టేడియంలో జరిగిన ఆదివాసీ, బంజారాల ఆత్మీయ సభలో పాల్గొని మాట్లాడిన కేసీఆర్ గిరిజన రిజర్వేషన్లను 10 శాతానికి పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేసి ఏడేళ్లు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ బిల్లును ఎందుకు ఆపుతున్నారో కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మోడీ పుట్టిన రోజున చేతులు జోడించి అడుగుతున్నానని బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయించాలన్నారు. రాష్ట్రపతి పదవిలోనూ గిరిజన బిడ్డనే ఉన్నారని వెంటనే బిల్లును ఆమోదింపచేయాలని అన్నారు. గిరిజన రిజర్వేషన్ల పెంచాలని ఈ సభ ఏకగ్రీవంగా ఆమోదిస్తుందని అన్నారు. విభజన రాజకీయం మొదలు పెట్టిన హోం మంత్రి అమిత్ షాను అడుగుతున్నానని.. గిరిజన రిజర్వేషన్లు మీరెందుకు తొక్కుతున్నారని ప్రశ్నించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఏం అడ్డమొచ్చింది.. చిల్లర రాజకీయం తప్పా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
త్వరలోనే పోడు భూముల సమస్యనూ పరిష్కరిస్తామన్నారు. పోడు రైతులకు భూములు ఇచ్చేందుకు గుర్తించామని అన్నారు. పోడు భూము రైతులకు రైతుబంధు ఇస్తామన్నారు. మోడీ హయాంలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ధనవంతుల ఇళ్లలో ఎలాంటి తాగునీరు సరఫరా చేస్తున్నామో ఆదిలాబాద్ తండాలు, గూడాలకు కూడా మిషన్ భగీరథ ద్వారా అలాంటి తాగు నీటినే సరఫరా చేస్తున్నామని గర్వంగా చెబుతున్నాన్నారు. హైదరాబాద్ నడి బొడ్డున ఆదివాసీ, బంజారా భవన్‌లను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని, గిరిజన బిడ్డల సమస్యల పరిష్కారం కోసం ఈ రెండు భవన్‌లూ వేదికలు కావాలన్ని ఆకాంక్షించారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ వారం రోజుల్లో జీవో ఇస్తామని, నరేంద్ర మోడీ మా జీవోను గౌరవిస్తావా? లేక దాన్నే ఉరితాడు చేసుకుంటావో తేల్చుకోవాలన్నారు. తమ ప్రభుత్వం ఒకే నినాదంతో వెళ్తోందని సంపదను పెంచు ప్రజలకు పెంచు అనే రీతిలో పని చేస్తున్నామన్నారు.
ఇదే నా గుండెల్లోని కోరిక:
దళితబంధు తరహాలోనే త్వరలో గిరిజన బంధు ప్రారంభిచంనున్నట్లు సీఎం ప్రకటించారు. కుల, మత వర్గ బేధాలు లేకుండా పరస్పర క్రమశిక్షణతో ఈ సమాజానికి దివిటీలుగా మారాలని ఆకాంక్షించారు. అన్ని రంగాలను దేశంలోనే అగ్రగామిగా ముందుకు సాగుతుందని చెప్పారు. తెలంగాణ సాగిస్తున్న అభివృద్ధి పరుగులను ఎన్ని పరిస్థితుల్లో ఆగకూడదని అన్నారు. మత చిచ్చులో పడితే కల్లోలానికి గురవుతామని అందరూ ప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ సమాజాన్ని శాంతి, సుఖాలతో సర్వమానవ సౌభ్రాతృత్వం వైపు తీసుకువెళ్లేందుకు తన చివరి రక్తపు బొట్టువరకు కృషి చేస్తాన్నారు. పీడిత ప్రజల కోసం తన జీవితాన్ని దారపోసిన డా. బి.ఆర్ అబేంద్కర్‌ను సముచితంగా గౌరవించుకోవడం కోసం సెక్రటేరియట్‌కు అంబేద్కర్ పేరు పెట్టుకున్నామన్నారు. అన్ని వర్గాలు కలిసి అన్ని వర్గాల శాంతి, సంతోషాలతో ఉండటమే తన గుండెల్లో ఉన్న కోరిక అన్నారు.