ఈటల రాజేందర్ కోరిక నేరవేర్చిన సీఎం కేసీఆర్

by GSrikanth |   ( Updated:2023-02-12 11:42:58.0  )
ఈటల రాజేందర్ కోరిక నేరవేర్చిన సీఎం కేసీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ సమావేశాల చివరిరోజున ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేల విజ్ఞప్తులను కేసీఆర్‌ తక్షణమే పరిశీలించి పరిష్కార మార్గాలు చేపట్టాలని అధికారులను, సంబంధిత మంత్రులను ఆదేశించారు. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేలైన భట్టి విక్రమార్క, ఈటల రాజేందర్ సూచించిన సూచనలు తక్షణమే అమలు చేయాలని, వారి నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.

డైట్ చార్జీలు పెంచాలని ఈటల కోరారని, అది న్యాయమైన కోరిక కాబట్టి తక్షణమే జీవో విడుదల చేయాలని సంబంధిత మంత్రికి, అధికారులకు సూచించారు. అంతేగాక, స్వయంగా ఈటల రాజేందర్ సలహాలు కూడా తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని కమ్యూనిటీలకు హైదరాబాద్‌లో భవన్‌లు ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. తమకు, తమ ప్రభుత్వానికి భేషజాలు లేవని, మంచి సలహాలు ఇస్తే తప్పకుండా స్వీకరిస్తామని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed