- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం కేసీఆర్ ఎఫెక్ట్.. ఆగిపోయిన ‘శాకుంతలం’ షోస్
దిశ, సినిమా: హైదరాబాద్‌లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల భారీ విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధమయింది. రేపు(ఏప్రిల్ 14) విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా విగ్రహావిష్కరణ జరగనుంది. హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ తీరంలో ఎన్టీఆర్ గార్డెన్‌కు ఆనుకుని ఉన్న స్థలంలో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ కార్యక్రమం మూలంగా పక్కనే ఉన్న ఐమాక్స్ మల్టీప్లెక్స్‌కు అనూహ్యంగా భారీ షాక్ తగిలింది.
కాగా, ఇదేరోజు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన ప్రతిష్టాత్మక భారీ బడ్జెట్ చిత్రం శాకుంతలం విడుదల కానుండటంతో థియేటర్‌కు యాజమన్యానికి భారీ దెబ్బ పడింది. విగ్రహ ఆవిష్కరణ అనంతరం భారీ బహిరంగ సభ ఉండటంతో రాత్రి 8 గంటల వరకు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీంతో థియేటర్‌కు వచ్చే అన్ని దారులు మూసివేయడంతో షోలు రద్దు చేసుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో తెల్లవారుజామున 5 గంటలకు వేసే బెనిఫిట్ షో తో పాటు సాయంత్రం 6 గంటలవరకు వేసే షోలు రద్దు చేశారు. ఆ తర్వాత రాత్రి పది గంటల నుంచి యథావిధిగా షోలు నిర్వహించనున్నారు. కాగా, ముందే టికెట్స్ బుక్ చేసుకున్న వారికి మనీ రిటర్న్ చేస్తామని థియేటర్ యాజమాన్యం హామీ ఇచ్చింది.
Also Read...