- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు
X
దిశ, వెబ్‌డెస్క్: ఇస్రో మరో రికార్డు సృష్టించింది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ సెంటర్ నుంచి ప్రయోగించిన ప్రతిష్టాత్మక చంద్రయాన్-3 రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్ళింది. చంద్రయాన్ స్పేస్‌క్రాఫ్ట్‌ను ఈ రాకెట్ మోసుకెళ్లింది. ఆగస్టు 23వ తేదీన చంద్రుడిపై ఆ ల్యాండర్ దిగే అవకాశాలు ఉన్నాయి. చంద్రుడి ఉపరితలాన్ని అధ్యయనం చేసేందుకు పేలోడ్‌లో ప్రత్యేక పరికరాన్ని పంపుతున్నారు. అయితే, ఈ ప్రయోగంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. చంద్రయాన్-3 రాకెట్‌ను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టడంపై కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్, శాస్త్రవేత్తలు, ఇతర సాంకేతిక సిబ్బందిని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. చంద్రయాన్-3 విజయవంతం కావడం ద్వారా భారత అంతరిక్ష పరిశోధన రంగం.. కీలక మైలురాయిని దాటిందని సీఎం అన్నారు.
Advertisement
Next Story